ADB :జిల్లా కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలిపిన TUWJ 143 ప్రతినిధులు. దుప్పట్లు అందేచేత.
By
Rathnakar Darshanala
జిల్లా కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలిపిన TUWJ 143 ప్రతినిధులు. దుప్పట్లు అందేచేత.
నేటి వార్త ఆదిలాబాద్ :
2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (tuwj H- 143) ఆధ్వర్యంలో జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం వేళ జర్నలిస్టు కుటుంబాలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఏడాది సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చలి తీవ్రత నేపథ్యంలో జర్నలిస్టు యూనియన్ తరపున పేదల కోసం దుప్పట్లను జిల్లా అధ్యక్షుడు బేత రమేష్ ఆదిలాబాద్ కలెక్టర్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ రాజు, జర్నలిస్టు సంఘం నేతలు ఎంఏ అన్వర్, డివిఆర్ ఆంజనేయులు, షాణం ప్రవీణ్, మడుపు సంతోష్, రత్నాకర్, సంతోష్ సుభాష్, శ్రీనివాస్, వీరేష్, అశోక్, సతీష్, అనిల్, బోల్లోజి నరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments