జాతీయ స్థాయి కబడ్డీకి వేముల తన్వి ఎంపిక.|| Neti Vartha ||
By
Rathnakar Darshanala
జాతీయ స్థాయి కబడ్డీకి వేముల తన్వి ఎంపిక.|| Neti Vartha ||
– విద్యార్థినికి ఘన సన్మానం
నేటివార్త రాయికల్ అక్టోబర్ 22::
ఈ నెల 16న సంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–14 బాలికల కబడ్డీ పోటీల్లో జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం, ఇటిక్యాల మోడల్ స్కూల్ విద్యార్థిని వేముల తన్వి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
ఆమె జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుందనీ ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు వి. కిషోర్ కుమార్ తెలిపారు.
విద్యార్థిని వేముల తన్వి ని, వ్యాయామ ఉపాధ్యాయుని, ప్రిన్సిపాల్ కొల్లూరి సంతోష్ కుమార్ ని గ్రామ పెద్దలు,ఉపాధ్యాయుల బృందం అభినందించి సన్మానం చేశారు.
వేముల తన్వి విజయంతో పాఠశాల యాజమాన్యం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments