ఒంగోలులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు.

Rathnakar Darshanala
ఒంగోలులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు.
 ఒంగోలు స్టాప్ రిపోర్టర్ :దగ్గుమాటి రజనీకాంత్ (నేటి వార్త) సెప్టెంబర్ 2 :

 ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగాయి.

 స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, జనసేన పార్టీ ఇంచార్జ్ షేక్ రియాజ్ ముఖ్య అతిథులుగా హాజరై పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.
Comments