కంభం చెరువుకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు.
By
Rathnakar Darshanala
కంభం చెరువుకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు.
నేటి వార్త గిద్దలూరు ఆర్ సి ఇంచార్జ్.
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రకాశం ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వరద నీరు అంతా గొలుసు కట్టు చెరువులు వరద నీరుతో నిండుతూ ఆ నీరంతా కంభం చెరువుకు వచ్చి చేరుతుంది.
దీంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఆయకట్టుపై ఆధారపడి జీవిస్తున్న రైతులందరూ ఈసారి పంటలు సాగు చేసేందుకు నీరు పుష్కలంగా ఉందని అధికారులు అన్నారు.
Comments