మహాత్మ జ్యోతిరావు ఫూలే దంపతులకు భారత రత్నతో గౌరవించాలి.సుకుమార్ పెట్కూలే.

Rathnakar Darshanala
మహాత్మ జ్యోతిరావు ఫూలే దంపతులకు భారత రత్నతో గౌరవించాలి.సుకుమార్ పెట్కూలే.
సామాజిక ఉద్యమానికి నాంది పలికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం స్త్రీ విద్యా, స్త్రీ సాధికారిక కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం, అహర్నిశలు కృషి చేసిన,

మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న బిరుదుతో గౌరవించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. 

సత్యశోధక స్థాపన 152 వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో గల మహాత్మ జ్యోతిరావు ఫులే దంపతుల విగ్రహాలకు మాలి మహా సంఘం మరియు సావిత్రిబాయి పూలే మహిళా మండలి సభ్యులతో కలిసి పూలమాలవేసి నివాలులర్పించరు.
 అనంతరం మీడియాతో మాట్లాడుతూ ...ఫులే దంపతులు 24 సెప్టెంబర్ 1873న "సత్యశోధక సమాజాన్ని" స్థాపించి సమసమాజ నిర్మాణం కోసం, స్త్రీ విద్యా ,స్త్రీ సాధికారత, స్త్రీల హక్కుల కోసం 

,సామాజిక న్యాయం కోసం అహర్నిశలు తమ జీవితాంతం కృషి చేసిన గొప్ప త్యాగమూర్తులని వారిని ఆదర్శంగా తీసుకుని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిబాపూలేను తన గురువుగా భావించి,

భారత రాజ్యాంగాన్ని రాశారని ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఈ దేశంలో సామాజిక న్యాయం లభించడం లేదని దానికోసం ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. 

అలాగే అంత గొప్ప మహానుభావులు ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ రూపుమాపడానికి పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించడానికి కృషి చేసిన పుణ్య దంపతులు కాబట్టి వారికి "భారతరత్న బిరుదు" ఇచ్చి గౌరవించాలని కోరారు . 

ఈ  కార్యక్రమంలో మాలి మహా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగి సాంబన్న , రాష్ట్ర కోశాధికారి, సతీష్ గురుణులే ,జిల్లా అధ్యక్షులు విజయ్ వాడగురే, కార్యవర్గ సభ్యులు కోట్రంగి అనిల్, డాక్టర్ రమేష్ ,రాగి రాం కిషన్, సావిత్రిబాయి పూలే మహిళా మండలి సభ్యులు మనిషా గురునులే, కల్పన పెట్కులే, అంజలి పెట్కులే, సుహర్ష వాఢయి, అద్విక్ పెట్కులే తదితరులు పాల్గొన్నారు.
Comments