విశ్వశాంతి పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు.
By
Rathnakar Darshanala
విశ్వశాంతి పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు.
నేటివార్త రాయికల్,ఆగస్టు 16:
రాయికల్‌లోని విశ్వశాంతి పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో అద్భుతంగా అలరించగా, వారి విన్యాసాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.
పాఠశాల ప్రాంగణం పూలదండలు, రంగురంగుల బెలూన్లు, ఆకర్షణీయమైన అలంకరణలతో పండుగ వాతావరణం సంతరించుకుంది.ఉట్టికొట్టే విధానం వేడుకల్లో ముఖ్య ఆకర్షణగా నిలిచింది.
కృష్ణవేషంలో ఉన్న చిన్నారులు కీర్తనలు పాడుకుంటూ, ఆనందోత్సాహాలతో ఉట్టి పగులగొట్టారు.ఆ క్షణం చప్పట్లు, హర్షధ్వానాలతో మారుమోగింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ, “మన సంప్రదాయ పండుగలు పిల్లలలో ఆధ్యాత్మిక భావనను,సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తాయి.
కృష్ణుడి బాలలీలలు ధర్మం, న్యాయం, ధైర్యానికి ప్రతీకలు. ఆ విలువలను చిన్నారులు ఆచరణలోకి తీసుకెళ్లేలా చేయడమే మా ఉద్దేశ్యం” అన్నారు.
వేడుకల్లో పాఠశాల డైరెక్టర్ మచ్చ లలిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు విస్తృతంగా పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.
Comments