జిల్లాలో భారీ వర్షం. పొంగిన వాగులు.మత్తడి వాగు గేట్లు ఎత్తివేత.
By
Rathnakar Darshanala
జిల్లాలో భారీ వర్షం. పొంగిన వాగులు.మత్తడి వాగు గేట్లు ఎత్తివేత.
తాంసీ నేటి వార్త :
ఆదిలాబాద్ జిల్లా లో ఉదయం నుండి వర్షం దంచికోట్టింది. ఉరుములు మెరుపులతో ఆకాశానికి చిల్లులు పడ్డాయా అనే రితిలో వర్షం బిబస్వం సృష్టించింది.
జిల్లా కేంద్రం తొ పాటుగా పాలు మండలాలలో గ్రామాలలో వాగులు ఒర్రెలు పొంగి పోర్లయి.
తాంసీ మండలంలోని మత్తడీ వాగు కు ఒక్కసారిగా వరద రావడంతో అధికారులు గేట్లు ఎత్తి కిందకి నీటిని విడిచిపెట్టారు.
అటు జైనథ్ మండలంలోని సత్నాల ప్రాజెక్టు కు వరద ఉదృత్తి పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి కిందకి నీరు వదిలిపెట్టారు.
గోటుకూరి గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లోకి భారీగా వరద నీరు చేరి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రైతు తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments