గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు.
By
Rathnakar Darshanala
గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు.
పల్నాడు జిల్లా బ్యూరో ఆగష్టు 31(నేటి వార్త)
దుర్గి మండలం అడిగోప్పల గ్రామ శివారులో గల పంట పొలాలలోని పాడుబడ్డ బావిలో గుర్తు తెలియని శవం పడి ఉండటం గమనించిన అక్కడి ప్రజలు దుర్గి పోలీస్ స్టేషన్ కు తెలియజేశారు.
అక్కడి నుండి పోలీసు వారు మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్ లోని మార్చురీ రూమ్ కి తరలించారు.
మీడియా ద్వారా నాలుగు రోజుల నుంచి గుర్తు తెలియని శవం గురించి ప్రచారం చేయగా ఆశవం తాలూకు వాళ్ళు ఎవరు రాలేదు.
ఇది గమనించిన దుర్గి ఎస్సై ఎల్. సుదీర్ కుమార్ మాచర్ల స్వామి వివేకానంద ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తో మాట్లాడి గుర్తు తెలియని శవానికి అంత్యక్రియలు చేయవలసిందిగా తెలియజేశారు.
వెంటనే గోవిందరెడ్డి స్పందించి తమ సభ్యులకు తెలియజేసి ఎస్ఐ పర్మిషన్ తీసుకొని తమ సభ్యుల సహకారంతో ఆ గుర్తు తెలియని శవానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇలాంటి సేవా కార్యక్రమం చేసిన స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సభ్యులని ప్రజలు అభినందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టీచర్ గండ్రకోట శివసుందర ప్రసాద్,వినయ్, యశ్వంత్, సురేంద్ర, అజయ్ పాల్గొన్నారు.
Comments