శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు.

Rathnakar Darshanala
శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు.
నేటి వార్త గిద్దలూరు :

*శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి దంపతులు గిద్దలూరు మండలం, నరవ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో స్వామి వారికీ అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆలయ పూజారులు ఎమ్మెల్యే గారి దంపతులకు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు వేద ఆశీర్వచనాలు అందించారు. 

ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి సోదరి గీతాభవాని గారు పాల్గోన్నారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి భక్తులకు ప్రసాదం వితరణ చేశారు.
Comments