Vanaparthi :టీయుడబ్ల్యూజే జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.

Rathnakar Darshanala
టీయుడబ్ల్యూజే జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.
*--ముఖ్య అతిథులుగా పాల్గొనున్న మంత్రి జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి,రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఛైర్మన్ కొత్తకాపు శివసేనా రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి*

*--రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్*

*నేటివార్త జులై 21(పెబ్బేర్ వనపర్తి జిల్లా ప్రతినిధి విభూది కుమార్)*

ఈ నెల 23వ తేదీన జరగనున్న టీయుడబ్ల్యూజే (ఐజేయు) తృతీయ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ స్టేట్ సెక్రటరీ గుండ్రాతి మధు గౌడ్ పిలుపునిచ్చారు. 

పెబ్బేరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన జిల్లా మహాసభల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న టీయుడబ్ల్యూజే యూనియన్ పెద్దపీట వేస్తుందని అన్నారు. 

ప్రతి సమస్యలపై గళమెత్తి రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి జర్నలిస్టులకు కావలసిన విద్య, వైద్యం, అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలపై మొదటి నుంచి కొట్లాడి ఇప్పించిన ఏకైక యూనియన్ టీయూడబ్ల్యూజే అని చెప్పారు. 

వనపర్తి మండలం చిట్యాల వద్ద ఉన్న దేశినేని పంక్షన్​ హాల్లో 23న బుధవారం జరగనున్న తృతీయ జిల్లా సభలకు,

ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్, ఐజేయు స్టీరింగ్ కమిటీ మెంబర్ దేవులపల్లి అమర్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్నారాయణ, 
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నా రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి వస్తున్నారని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా వారిని కోరనున్నట్లు తెలిపారు. 

కమిటీలో ఉండేవారే లీడర్లు కాదని, సభకు వచ్చే ఒక్క జర్నలిస్టు లీడరేనని అన్నారు.

 జిల్లా మహాసభలకు అన్ని మండలాల నుంచి యునియన్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై జర్నలిస్టుల ఐక్యతను చాటుతూ జయప్రదం చేయాలని కోరారు. 

అనంతరం ఇటీవలే న్యాయవాద పట్టా అందుకున్న సీనియర్ జర్నలిస్టు పౌర్ణా రెడ్డిని పెబ్బేరు ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు వనపర్తి నుంచి వచ్చిన యూనియన్  నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మాధవరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలవర్ధన్, జర్నలిస్టులు ఊషన్న, శ్రీనివాసరావు, రాజు, మణ్యం, నరసింహరాజు, అరుణ్, ఎన్. శ్రీనివాస్, రవికాంత్, విజయ్ కుమార్, బాలరాజు, కిరణ్ కుమార్ గౌడ్, రాజేంద్రప్రసాద్, గోపాలకృష్ణ, ఎ. విజయ్, పరుశరాముడు,

 కెఎం. భాషా, అతీక్, మణ్నెం, రమేష్, నాగరాములు, రాంబాబు, రామకృష్ణ, రంజిత్, తరుణ్, ప్రకాష్, గోపి, నాగరాజు, మహేష్, శంకర్, మిద్దె రాములు, శ్రీకాంత్, బద్రుద్దీన్, గోవిందు, రాజేష్, ఎం. రాములు, ఎ. రాము,  శివరాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments