అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.

Rathnakar Darshanala
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.
నేటివార్త జగిత్యాల బ్యూరో, జూలై 21:


ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల, జగిత్యాల — 2025–26 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో బోధన కొరకు అర్హతగల అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య అరిగెల అశోక్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

కళాశాలలో ప్రస్తుతం కామర్స్ – 1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ – 1, ఇంగ్లీష్ – 2, చరిత్ర – 1, గణిత శాస్త్రము – 1, భౌతిక శాస్త్రము – 1, రాజనీతి శాస్త్రము – 1, తెలుగు – 2 పోస్టుల కొరకు అతిథి అధ్యాపకుల అవసరం ఉందని తెలిపారు.

అర్హతలు సంబంధిత సబ్జెక్టులో పీజీలో సాధారణ అభ్యర్థులకు కనీసం 55 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి.

  ఎన్ ఈ టి, ఎస్ ఈ టి, పి హెచ్ డి అర్హతలు ఉన్నవారికి మరియు బోధనానుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

దరఖాస్తు ప్రక్రియ అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 22 నుండి 24 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య, కళాశాల కార్యాలయంలో పని దినాలలో జిరాక్స్ సర్టిఫికెట్లతో కలిసి సమర్పించాల్సి ఉంటుంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూలై 25, శుక్రవారం ఉదయం 5 గంటలకు కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని వివరాలకు అకాడమిక్ కోఆర్డినేటర్లుజి. సాయి మధుకర్  8121513671కే. సురేందర్ 9182629763 సంప్రదించాలని తెలియజేశారు.
Comments