జీపీవో లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.జిల్లా కలెక్టర్.
By
Rathnakar Darshanala
జీపీవో, లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.జిల్లా కలెక్టర్.
*జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్*
నేటి వార్త నిర్మల్ జిల్లా ప్రతినిధి జులై 25
ఈ నెల 27వ తేదీన (ఆదివారం) జరగబోయే గ్రామ పాలనా అధికారులు (జీపీవో), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామక పరీక్షలను ఎలాంటి లోటుపాట్లూ లేకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జీపీవో పరీక్ష నిర్వహణకు పట్టణంలోని చాణక్య పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మొత్తం 55 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు అభ్యర్థులను 10 గంటలలోపు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు. ఈ పరీక్షకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని వెల్లడించారు.
లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 85 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.
ఈ పరీక్ష ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
ఈ పరీక్షకు ఏడి సర్వే & ల్యాండ్ రికార్డ్స్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగాలన్నారు.
పరీక్ష కేంద్రాల పరిసరాలలోని జిరాక్స్ కేంద్రాలను పరీక్ష సమయంలో మూసివేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అభ్యర్థులు సెల్ ఫోన్‌లను పరీక్ష కేంద్రాలకు అనుమతిలేదని కలెక్టర్ స్పష్టం చేసారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, ఏడి సర్వే & ల్యాండ్ రికార్డ్స్ అధికారి ఆర్. సుదర్శన్, కలెక్టరేట్ ఏవో సూర్యారావు, పర్యవేక్షకులు మోతిరాం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments