అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
By
Rathnakar Darshanala
అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
(నేటి వార్త) నార్నూర్
ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక ప్రజల వద్ద డబ్బులు వసులు చేస్తే కఠిన చర్యలు తప్పవని నార్నూర్ సిఐ ప్రభాకర్ హెచ్చరించారు.
గాదిగూడ మండలానికి చెందిన బాధితుడు భీంరావ్ ఇచ్చిన పిర్యాదు మేరకు నాంపల్లి సంతోష్ అనే వ్యక్తి ఆదిలాబాద్ ఎమ్మెల్యే మనిషిని అని ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఏడాది క్రితం 50,000 వేల రూపాయలు వసులు చేసినట్టు అయన తెలిపారు.
సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో మోసాన్ని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
కావున నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. అక్రమ వసూళ్ళు, మోసపురిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments