టెక్స్టైల్ పార్కులో కార్మికులకు జీతభత్యాల పెంపు పై ధర్నా.
By
Rathnakar Darshanala
టెక్స్టైల్ పార్కులో కార్మికులకు జీతభత్యాల పెంపు పై ధర్నా.
నేటి వార్త న్యూస్, జులై 22 : రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో కార్మికులకు రావలసిన 10% యారన్ సబ్సిడీ ట్రిప్ట్, ఉపాధి, కూలి పెంపు తదితర సమస్యలు పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్ లూమ్ వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రధాన ద్వారం వద్ద ధర్నా.
మంగళవారం ఉదయం11:30 గంటల సమయంలో సిఐటియు జిల్లా పవర్ లోన్ వర్కర్ యూనియన్ అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కులో 2023 సంవత్సరం బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి ఒక రూపాయి 42 పైసలు చొప్పున వెంటనే అందించాలని అన్నారు.
ట్రిప్ట్, నేతన్న పొదుపు పథకం ప్రభుత్వం నుండి కార్మికులకు రావలసిన డబ్బులను వెంటనే ఖాతాలో జమ చేయాలని పేర్కొన్నారు.
టెక్స్టై ల్ పార్కులో ఉత్పత్తి చేసే ప్రభుత్వ వస్త్రానికి కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలి పెంచి ఇవ్వాలని అన్నారు.
టెక్స్టైల్ పార్క్ లో ప్రైవేట్ వస్త్రాలకు కూలి ఒప్పందం ముగిసి 15
నెలలవుతుందని తెలిపారు.
కావున కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని టెక్స్టైల్ పార్కులో మూతబడ్డ పరిశ్రమలు తెరిపించి పూర్తిస్థాయిలో పరిశ్రమలు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ కార్మికులు పాల్గొన్నారు.
Comments