వాగులో కొట్టుకుపోయిన మహిళాలు..కూలి కోసం పోతే ప్రాణం మీదికి వచ్చింది.

Rathnakar Darshanala
వాగులో కొట్టుకుపోయిన మహిళాలు..కూలి కోసం పోతే ప్రాణం మీదికి వచ్చింది.
-వరి నాట్లకు పోయి వాగులో చిక్కుకున్న మహిళ కూలీలు..

-చాకచక్యంగా తాడు సహాయంతో కాపాడిన స్థానికులు..

-ఊపిరి పీల్చుకున్న గౌరెడ్డిపేట గ్రామస్తులు..

నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 26 ఆడిచర్ల రమేష్

పొట్ట తిప్పల కోసం పొరుగు ఊరికి కూలి కోసం నాట్లు వేయడానికి పోతే మా ప్రాణాలకే ముప్పు వచ్చిందని గౌరెడ్డి పేటకు చెందిన మహిళ కూలీలు ఆవేదన చెందారు.

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జొన్నల మల్యాల సమీపంలోని నక్కల వాగు శనివారం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వరి నాట్లు వేయడానికి వచ్చిన మహిళ కూలీలు వాగులో చిక్కుకున్నారు. 

మల్యాల నుండి పోచంపల్లి వెళ్లే దారిలో నక్కల వాగు అవతలి ఒడ్డు వైపు ఉన్న రైతుల పొలాలలో  పెద్దపల్లి మండలం గౌరెడ్డి పేట గ్రామం నుండి 15 మంది మహిళా కూలీలు వరి నాట్లు వేయడానికి రాగా

ఉదయం వర్షం అంతంతమాత్రంగా ఉండడంతో అవతలి వైపుకు దాటిన కూలీలందరూ పని ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో మధ్యాహ్నం కురిసిన కొండపోత వర్షానికి నక్కల వాగు ఉధృతం అయి అందులో చిక్కుబడిపోయారు. 

వెంటనే విషయం తెలుసుకున్న మల్యాల గ్రామానికి చెందిన కొందరు యువకులు తాళ్ల సహాయంతో కూలీల అందరిని క్షేమంగా బయటికి తీసుకొచ్చారు.
Comments