అక్రమ అరెస్టులను ఖండించిన సిపిఎం.
By
Rathnakar Darshanala
అక్రమ అరెస్టులను ఖండించిన సిపిఎం.
నేటి వార్త జూలై 22, కాగజ్ నగర్:
కాగజ్నగర్ పట్టణ సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాల్సిందిగా కోరుతూ మంగళవారం శాంతియుతంగా నిర్వహించిన ర్యాలీ నిర్వాహకులను అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది.
ఈ సందర్భంగా ఆ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రాయితీలు ,
నిధులు వనరులను ఉపయోగించుకుంటున్న జై కే యాజమాన్యం ఉద్యోగాలు మాత్రం బయటి రాష్ట్రాల వారికి ఇస్తుందన్నారు.
యాజమాన్యం తమ వైఖరి మార్చుకోకపోతే లోకల్ నాన్ లోకల్ ఫీలింగు వచ్చి ఉద్యమం ఏ రూపం దాల్చుతుందో దానికి పూర్తి బాధ్యత యాజమాన్యమే వహించాలని హెచ్చరించారు.
అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడుతుందని ఆయన హెచ్చరించారు,
Comments