బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభ్యునాతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్.
By
Rathnakar Darshanala
బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభ్యునాతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్.
-మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తా.....
-పెద్దపల్లి జిల్లాలో ఉర్దూ డిగ్రీ కళాశాల మంజూరు కి కృషి చేస్తా....
-ఎస్సీ,ఎస్టీ మైనార్టీ శాఖల మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్.....
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 22 ఆడిచర్ల రమేష్
మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానని,తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల మైనార్టీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ఎస్సీ,ఎస్టీ మైనార్టీ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం పెద్దపల్లి కి చెందిన ప్రముఖ మైనార్టీ నాయకులు మీర్జా అహ్మద్ బేగ్ నివాసంలో మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు తో కలిసి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,పెద్దపల్లి జిల్లా కేంద్రం తన పుట్టిన స్వస్థలం అని ఇక్కడికి వస్తే కుటుంబ సభ్యుల మధ్య వచ్చినట్టు ఉందని,ప్రముఖ మైనార్టీ నాయకులు మీర్జా అహ్మద్ బేగ్ తనను సన్మానించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, పెద్దపల్లి పట్టణ కేంద్రంలో మైనార్టీల జనాభా అధికంగా ఉందని,త్వరలోనే తప్పకుండా పెద్దపల్లి లో మహిళా డిగ్రీ కళాశాల,మైనార్టీ షాది ఖానా, మైనార్టీ గ్రంథాలయం ఎమ్మెల్యే విశారమణారావుతో కలిసి ముఖ్యమంత్రితో చర్చించి మంజూరు అయ్యేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మైనార్టీ యువతకు మీర్జా అహ్మద్ బేగ్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ గత ఐదు సంవత్సరాల నుండి నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ,తాను గెలిచినప్పటి నుండి మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నానని,గెలిచిన వెంటనే రాఘవపూర్ శివారులో ముస్లిమ్ స్మశాన వాటికకు రెండు ఎకరాల స్థలం మంజూరు చేయించానని, త్వరలోనే ఆ స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని, ఇందిరమ్మ ఇండ్లలో నిరుపేద మైనార్టీ సోదరులకు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.కంప్యూటర్ శిక్షణ కేంద్రం లో ఉత్తీర్ణులైన పిల్లలకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.అనంతరం మీర్జా అహ్మద్ బేగ్,మోహిద్ బేగ్ లు మాట్లాడుతూ,తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల పట్ల సానుకూలంగా ఉందని,మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మహమ్మద్ బేగ్ కుటుంబ సభ్యులు,జమాతే ఇస్లామి హింద్ పట్టణ అధ్యక్షులు ఎం.ఏ. మోహిద్,జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హై జావిద్,జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గండు సంజీవ్,సయ్యద్ మస్రత్,హది, అక్బర్ అలీ,తబ్రెజ్,అస్లాం, శ్రీమాన్,గోపగాని సారయ్య గౌడ్, ట్రాన్స్కో ఎస్.ఈ.బొంకూరి సుదర్శన్,బొంకూరి రవీందర్, ముస్తాక్ మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.
Comments