ఓపెన్ జిమ్ లో...కనీస సౌకర్యాలు కరువు.
By
Rathnakar Darshanala
ఓపెన్ జిమ్ లో...కనీస సౌకర్యాలు కరువు.
-రాయికల్ పట్టణంలోని వ్యాయామ యంత్రానికి సీటు లేక ప్రజలు అసౌకర్యానికి గురి.
నేటివార్త రాయికల్,జూలై 20:
పట్టణంలోని ఓపెన్ జిమ్ లో మౌలిక వసతుల కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాయికల్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లోని ముఖ్యమైన వ్యాయామ యంత్రం ఒకటి ప్రస్తుతం వినియోగానికి అర్హంగా లేకుండా ఉంది.
విషయాన్ని పరిశీలిస్తే, ఫోటోలో కనిపిస్తున్న విధంగా, ఆయా పరికరానికి అవసరమైన సీటు భాగం పూర్తిగా విరిగిపోయి గల్లంతయింది.
దీంతో ప్రజలు ఈ యంత్రాన్ని ఉపయోగించలేక నిరాశ చెందుతున్నారు.ముఖ్యంగా మహిళలు, యువత రోజూ ఉదయం,సాయంత్రం వేళల్లో వ్యాయామం కోసం జిమ్‌ను ఆశ్రయిస్తున్నా,ఈ లోపంతో అవసరమైన ప్రయోజనం పొందలేకపోతున్నారు.
“ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటైన ఓపెన్ జిమ్ పరికరాలను సరైన నిర్వహణ లేకుండా వదిలేయడం బాధాకరం.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సీటు మరమ్మతులు చేపట్టాలి,”అని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని రాయికల్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Comments