స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి గెలుపే లక్ష్యం: బిజెపి జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్.
By
Rathnakar Darshanala
స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి గెలుపే లక్ష్యం: బిజెపి జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్.
నేటి వార్త ఆదిలాబాద్ :
సోమవారం సత్నాల గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల వర్క్ షాప్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న అదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ గారు మాట్లాడుతూ,
రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, అభ్యర్థిని గెలుపు దిశగా,
ముందుండి నడిపించే బాధ్యత కార్యకర్తల పై ఉన్నదని బిజెపి ప్రభుత్వం అభివృద్ధి పనులను ప్రజలలో వివరిస్తూ బిజెపి పార్టీకి ఓటు వేసేలా చూడాలని ప్రతి ఒక్క బూత్ కార్యకర్తలు అందరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ క్రాంతి కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుభాష్ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Comments