చలో గన్ పార్క్ కి తరలి వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులు.
By
Rathnakar Darshanala
చలో గన్ పార్క్ కి తరలి వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులు.
నేటి వార్త జమ్మికుంట: హైదరాబాదులో నిర్వహించే ఛలో గన్ పార్క్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ గారి పిలుపుమేరకు
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి మరియు తెలంగాణ ఉద్యమకారుల విభజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ గార్ల ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక కమలాపూర్ మండలాల నుంచి ఉద్యమకారులు బయలుదేరడం జరిగింది.
ముందుగా జమ్మికుంట లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకి నివాళులు అర్పించారు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులు తమ సమయాన్ని వృధా చేసుకుని తమ ఆర్థిక విధానాన్ని చిన్నాభిన్నం చేసుకుని ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడి తెచ్చుకున్నటువంటి స్వరాష్ట్ర సాధనకై ఉద్యమించిన ఉద్యమకారులని
విస్మరించడం వారికి తగిన గుర్తింపును ఇవ్వకపోవడం చేసినందున ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులని గుర్తించి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలను త్వరతగినగా నెరవేర్చాలని ఝార్ఖండ్ రాష్ట్రం తరహాలో రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసినటువంటి
ఉద్యమకారులందరినీ గుర్తించే ఏదైతే 250 గజాల ఇండ్ల స్థలాన్ని మంజూరు చేసి అదే విధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి శాంతియుతంగానే తెలియజేయడానికి ఈ యొక్క చర్యగా చలో గన్ పార్క్ కార్యక్రమం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో:- తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి, రాష్ట్ర యువజన కో కన్వీనర్ అన్నం ప్రవీణ్, జిల్లా కార్యదర్శి మూడెడ్ల కుమారస్వామి, నియోజక వర్గం,
కార్యదర్శి ఆరే రమేష్ రెడ్డి, నాయకులు పెద్ది కుమార్, నర్రా భూమిరెడ్డి, గురుకుంట్ల రాజీరూ, మారపల్లి అంజన్న, మహేంద్ర చారి, తాడెం దిలీప్, రేణికుంట్ల రవి, బిజిగిరి శ్రీకాంత్,పూరేళ్ల శ్రీనివాస్ ఆకినపల్లి వెంకటేష్, గురుకుంట్ల సాంబయ్య, గుడికందుల రాజయ్య, రామంచ రామకృష్ణ, రవీంద్ర చారి, తదితరులు పాల్గొన్నారు.
Comments