బంద్ సంపూర్ణం...ప్రశాంతం.

Rathnakar Darshanala
బంద్ సంపూర్ణం...ప్రశాంతం.
నేటి వార్త జూలై 21 కాగజ్ నగర్: 

ఆదివాసుల హక్కులు కాల రాస్తున్న జీవో నెంబర్ 49 కి వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా ,ప్రశాంతంగా ముగిసింది. బందుకు మద్దతుగా భాజపా, టిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ధర్నాలు, ఊరేగింపులు చేపట్టాయి. 

సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 49 రద్దు చేయని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. 

ఈ జీవో ద్వారా జిల్లా అభివృద్ధి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 339 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతారు అన్నారు. సిర్పూర్ తాలూకాలో ప్రజలు బంద్ పాటించారు. షాపులు, హోటల్లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. 

ఆదివాసీలు తలపెట్టిన ఈ బంద్ కు కాగజ్ నగర్, సిర్పూర్, బెజ్జూరు, దహ గాం మండలాల్లో బంద్ జరిగింది.

 సిర్పూర్ టి మండల కేంద్రంలో భాజపా మండల అధ్యక్షురాలు చనకపురి లావణ్య, ప్రధాన కార్యదర్శి రాచర్ల మహేష్ యాదవ్, మాజీ మండల అధ్యక్షులు ఎల్ముల శంకర్, కొలవార్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రంగన్న, మండల యూత్ అధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా సహాయ కార్యదర్శి బోట్లకుంట శ్రీనివాస్, తుడుం దెబ్బ మండల ఉపాధ్యక్షుడు సీడం బాబాజీ, సిడం భీమ్రావు, లు పాల్గొన్నారు.

 ఇంకా కాగజ్నగర్ రూరల్ మండలం బిజెపి అధ్యక్షులు పుల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి భీమన్ కార్ బాపురావు, మాజీ మండల అధ్యక్షులు రణవీర్ విశ్వాస్, ఈశ్వర్ దాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాళిదాసు ముజుందార్, జిల్లా స్పోక్స్ పర్సన్ సమీర్ గుప్తా, 
ఆదివాసి సేవా సంఘం అధ్యక్షులు చింతపురి పోచం, లచ్చన్న ఆదివాసి నాయకులు పాల్గొన్నారు. 

ఇదిలా ఉండగా ఆదివాసీల కు ఇబ్బందికరంగా మారిన జీవో 49 లోపభూయిష్టంగా ఉందని బి ఆర్ ఎస్ పార్టీ సిర్పూర్ తాలూకా కన్వీనర్ లెండు గురి శ్యామ్ రావు విమర్శించారు. జీవో రద్దయ్య వరకు పోరాటాలు ఆపబోమని అన్నారు. 

జీవో నెంబర్ 49 రద్దుకై సిపిఎం పార్టీ బందులో పాల్గొంది. ఆదివాసులకు యమపాశంగా మారిన జీవను రద్దు చేయాలంటూ వారు ముక్తకంఠంతో కోరారు. ఈ బంద్ ధర్నాలో సిపిఎం పార్టీ ప్లక్ కార్డులతో నిరసన తెలిపింది.

 కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుశాన రాజన్న, ముంజ ఆనంద్ కుమార్, సిర్పూర్ కన్వీనర్ ముంజం శ్రీనివాస్, చాపిలే సాయి, 

జిల్లా కమిటీ సభ్యులు భోగి గిరి కుమార్, అల్వాల చంద్రయ్య, ఉట్ల రవి, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు చాంద్ పాషా, పోషన్న, ప్రజా సంఘాల నాయకులు జయదేవ్ అబ్రహం, టిఆర్ఎస్ కార్మిక సంఘం నాయకులు అంబాల ఓదేలు లు పాల్గొన్నారు.
Comments