తెలంగాణ రాష్ట్రంలోని హోమ్ గార్డ్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

Rathnakar Darshanala
తెలంగాణ రాష్ట్రంలోని హోమ్ గార్డ్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
- ప్రతి నెల ఒకటి రెండు తేదీలలో అధికారులతో సమానంగా జీతాలు వేయాలి.

- ఎంసిపిఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్.

నేటివార్త, జూలై 21, బెల్లంపల్లి:

బెల్లంపల్లి పట్టణంలోని ఎంసిపిఐయూ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంసిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ,

 హోంగార్డ్స్ అనేది భారతదేశంలో మొదటి డిసెంబర్ 1946లో, పురుడు పోసుకుంది స్వచ్ఛంద, దళం, పౌర అల్లర్లు మత అల్లర్లను నియంత్రించడంలో పోలీసులకు సహాయం చేయడానికి, 

తదనంతరం, స్వచ్ఛంద పౌర దళం అనే భావనను అనేక రాష్ట్రాలు స్వీకరించాయి 1962లో చైనా దురాక్రమణ నేపథ్యంలో , కేంద్రం  రాష్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చింది,

 మరి ఇప్పుడు వాళ్ల స్థితిగతులు తారుమారు హోంగార్డుల కన్నీళ్లు తుడిచే నాధుడు అడుగడుగునా ఆంక్షలు ప్రశ్నిస్తే క్రమశిక్షణ చర్యలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 వేలమంది హోమ్ గార్డులు ప్రజల కోసం అహర్నిశలు సేవలందిస్తున్నారు.

 వానకు తడిచి ఎండకు ఎండి ప్రజాప్రతినిధుల రాజకీయ సభలు, సమావేశాలు ఎక్కడ పెట్టిన బందో భస్తూ సమర్థంగా  నిర్వహిస్తారు. 

ప్రజల కోసం శాంతి భద్రతల కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. వీరి సంక్షేమం గురించి ఏమాత్రం పట్టింపు లేదు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి భద్రత కల్పించడం లేదు 25 మార్చి ఢిల్లీ అఖిలభారత హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం కొనసాగింది.

 బ్రిటిష్ కాలంలో ఏర్పడిన ఈ సంస్థ ఇంకా స్వస్థత సేవగా కొనసాగుతూ శ్రమ దోపిడీకి గురవుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన హోంగార్డులను మాత్రం ఎలాంటి స్వాతంత్రం లేక కాకి బట్టల నడుమ నలిగి పోతున్నారు.

 వీరికి కారకులు అనేకమంది అనేక కారణాలు ఎవరికి తోచిన విధంగా వారు ఆదేశాలు ఇస్తారు. ఆపద వస్తే ఆదుకునే నాధుడు కరువయ్యారు. 

2016 నుండి హోంగార్డ్ కుటుంబాలకు కారుణ్య నియామకాలు లేక వారి పిల్లలు వారి కుటుంబాలు చాలా దయనీయ పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. 

కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కుని కోల్పోయి భిక్షాటన చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నో మార్లు విజ్ఞప్తులు చేసిన సాక్షాత్తు ఆనాడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలో అండగా నిలబడి ఈనాడు కనీసం హోంగార్ల గురించి పలకరింపు కరువైంది.

 ఈ శాఖకు అధిపతి లేక సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాల నుండి నూతన జిల్లాలు ఏర్పడిన నాడి నుండి ఈరోజు వరకు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉద్యోగం చేస్తున్నారు.

 వారి పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. వారి తల్లిదండ్రులు పోసిన భారం అవుతుంది. కానిస్టేబుల్ వలె వీరికి టి ఏ లు, హెచ్ఆర్ఏ లాంటి అలావెన్స్ లు ఏవి ఉండవు. 

ఆఖరికి ప్రజలను కాపాడడం కోసం దొంగలను పట్టుకోవడం కోసం పరిగెడితే ఆ సమయంలో ప్రమాదం జరిగితే ఎవరు పట్టించుకోరు. 

ముఖ్యమంత్రి డిసెంబర్ 6 తారీకు ప్రకటించిన హెల్త్ కార్డు ఇప్పటివరకు మోక్షం లేదు, ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా హోమ్ గార్డ్ ల సమస్యలను తీరుస్తామని బహిరంగగా ఒక లేఖలో రాయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 

హోంగార్డులకు హెల్త్ కార్డుల అందజేయాలి, అంగన్వాడి   తరహాలో హోంగార్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, కారుణ్య నియామకాలు అమలు చేయాలి, 

కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో సీనియార్టీ ప్రతిపాదికన ఎక్స్ సర్వీస్ మెన్ కు ఇస్తున్న సడలింపులు హోంగార్లకు ఇవ్వాలి, ప్రతినెల పోలీసులతోపాటు ఒకటవ తారీఖు వేతనాలు అందజేయాలి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంసిపిఐయు పార్టీ పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, ఆరెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments