విశ్వశాంతిలో బోనాల పండుగ వేడుకలు.

Rathnakar Darshanala
విశ్వశాంతిలో బోనాల పండుగ వేడుకలు.
నేటివార్త రాయికల్ జూలై 19:
రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో ఆషాడ మాసంలో భాగమైన "బోనాల పండుగ"ను  అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

విద్యార్థులు పోతరాజు అవతారాలలో అలరించారు అలాగే పెద్దపులి వేషధారణలతో పిల్లలందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ,భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. 

మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, 

ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. 

ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత,
విద్యానేష్, ఉపాధ్యాయులు రంజిత్,మహేష్,రజిత,
ఇందుజా,సంజన  తదితరులు పాల్గొన్నారు.
Comments