శాతవాహన పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ.
By
Rathnakar Darshanala
శాతవాహన పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ.
నేటివార్త జగిత్యాల బ్యూరో జూలై 19 :
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతికగా నిలిచే ఆషాడ మాసం బోనాల పండుగను జగిత్యాల పట్టణంలో శాతవాహన హైస్కూల్ లో విద్యార్థులు ఉపాధ్యాయులు సమిష్టిగా కలిసి భక్తి శ్రద్దలతో నిర్వహించారు.
తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని విజ్ఞప్తి చేశారు. ఎన్నో తరాల నుండి అవలంబిస్తున్న ఈ ఘనమైనటువంటి సాంప్రదాయం ఎటువంటి లోటు పాటు లేకుండా జరగడం శుభపరిణామన్నారు.
విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తులతో విచ్చేసి నెత్తిన బోనం ఎత్తుకొని చేసిన నృత్యాలు విన్యాసాలు చూపరులను ఆకర్షించాయి.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్యామ్ సుందర్ కిరణ్మయ్ అంజలి సిందూజ రాణి సుచిత్ర పద్మ మానస పాల్గొన్నారు.
Comments