నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి.
By
Rathnakar Darshanala
నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి.
నేటివార్త రాయికల్ జూలై 21:
నేడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని...నాడే ప్రకటించిన ఉద్యమకవి స్వర్గీయ దాశరథి కృష్ణమాచారి.
ఆయనను స్మరిస్తూ రాయికల్ పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన కవిత.
సతతహరితం దాశరథి సాహితీ వనం..!!
నిజాం నిరంకుశ పాలనను
నాటి రజాకారుల దుర్మార్గాలను
రాజు రివాజులు బూజు పట్టెననుచు
కలంతో ఎండగట్టిన యోధుడు...
అన్యాయాన్ని ప్రశ్నించి నిర్బంధాలకు లోనైనా భయపడడం మరణం కన్నా హీనమని తలచి
చెరగని ధైర్యానికి తను చిరునామై నిలిచి కలాన్ని కత్తిగా ఝలిపిస్తూ,
కవి సింహమై గర్జిస్తూ,
జనంలో చైతన్య జ్వాలలు రగిలిస్తూ,
చెరశాల గోడలపైనే పద్యాలు రాసిన ధీరుడు...,
ఆవేశానికి అక్షరరూపాన్నిచ్చి
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మెంతోనంటూ
జన హృదయాలను కదిలిస్తూ
పెనునిద్దుర వదిలిస్తూ
అభ్యుదయం వైపు నడిపించిన సాహితీ సైనికుడు...!
ఖుషి ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ ప్రజలను పాటల పూతోటలో విహరింపజేసిన భావుకుడు .
అగ్ని ధార కురిపించి,
రుద్రవీణ మీటించి
తిమిరంతో సమరం చేసి అమృతాభిషేకం పొంది
అచ్చ తెనుగు కవితలల్లి
మహాంధ్రోదయం చూపిన మహోన్నతుడు..
గజల్ ప్రక్రియ మనకు అందించిన
ప్రతిభా శీలి ప్రజాకవి
ఆంధ్ర కవితా సారథి నవకవితా జలధి
మన దాశరథి కృష్ణమాచారి
సతతహరితం ఆయన సాహితీవనం
తెలుగు జాతికి చిరస్మరణీయం
***. ****
చెరుకు మహేశ్వర శర్మ
రాయికల్,జగిత్యాల
9441094011
Comments