రాజీవ్ యువ వికాసం పథకాన్ని తుంగలో తొక్కిన ప్రభుత్వం.

Rathnakar Darshanala
రాజీవ్ యువ వికాసం పథకాన్ని తుంగలో తొక్కిన ప్రభుత్వం.
 *పార్టీ యువజన మండల అధ్యక్షుడు గద్దల రామకృష్ణ..... 

(భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురం నేటి వార్త 21/07/25) 

నిరుద్యోగ యువతకు చేయూత అందించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయకుండా తుంగలో తొక్కిందని బిఆర్ఎస్ పార్టీ యువజన మండల  అధ్యక్షులు గద్దల రామకృష్ణ ఆరోపించారు. 

సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

ఈ పథకం ద్వారా మండలంలోని నిరుద్యోగ యువకులకు ఆర్థిక సహాయం అందిస్తారన్న ఉద్దేశంతో మండలం లో సుమారు 2 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకొని ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. 

ప్రభుత్వం అనాలోచిత పథకాలను పెట్టి నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లె ప్రయత్నం చేస్తుందని ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు,

కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా పెట్టిన ఈ పథకాన్ని నమ్ముకుని అర్హులైన వారు పథకాన్ని పొందేందుకు ఆన్లైన్లో వందలాది రూపాయలు వెచ్చించి దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. 

దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఈ పథకం  ఇవ్వకపోవడం ముమ్మాటికీ నిరుద్యోగులను మోసం చేయడమే
Comments