వి.వి రావుపేట్ వివేకానంద విద్యాలయంలో ఘనంగా బోనాల పండుగ.
By
Rathnakar Darshanala
వి.వి రావుపేట్ వివేకానంద విద్యాలయంలో ఘనంగా బోనాల పండుగ.
మల్లాపూర్ జులై 21 (నేటి వార్త దిన పత్రిక)
మల్లపూర్ మండలంలోని వి.వి.రావుపేట్ గ్రామంలో ఆదివారం నాడు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రధానోపాధ్యాయులు పోతు గోపి మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ అన్నారు.
తెలంగాణ సంస్కృతిని నేటి తరానికి తెలియజేయాలని ఉద్దేశంతో విద్యార్థులచే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
చిన్నారుల పోతురాజు విన్యాసాలు పెద్దమ్మతల్లి వేషధారణ మరియు ఎల్లమ్మ తల్లి వేషధారణలో చిన్నారులు మెరిసిపోయారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments