టెట్రా హెడ్రాన్ స్కూల్స్ లో ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్.
By
Rathnakar Darshanala
టెట్రా హెడ్రాన్ స్కూల్స్ ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్.
నేటి వార్త హుజూరాబాద్ :పట్టణంలోని టెట్రా హెడ్రాన్ స్కూల్స్ నందు ఉచిత హెల్త్ చెకప్ ని, విజేత చిల్డ్రన్స్ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించామని, టెట్రా హెడ్రాన్ స్కూల్స్ చైర్మన్ ముచ్చ నారాయణరెడ్డి గారు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాలకి పిల్లల వైద్య నిపుణుడైన గాధం రవివర్మ ఏం.డి. పెడియాట్రిక్స్ గారు పిల్లలను పరీక్షించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా సమస్యల ఆధారంగా పిల్లలకు ఉచిత మందులు అందించారు. అలాగే కంటి పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి బ్లడ్ గ్రూప్ తెలియజేశారు.
ఈ సందర్భంగా పిల్లల వైద్య నిపుణులు మాట్లాడుతూ విద్యార్థులు బలమైన ఆహారం తీసుకోవాలని, పిల్లలకు సెల్ ఫోన్ ని దూరంగా ఉంచాలని, అలాగే చిన్న సమస్యలకు సైతం సొంత వైద్యం చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసారు.
తదనంతరం టెట్రా హెడ్రాన్ స్కూల్స్ చైర్మన్ ముచ్చ నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ పిల్లలు సరైన ఆహారం తీసుకుంటే ఎదుగుదల బాగుంటుంది అని,
ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని, అలాంటప్పుడే విద్యార్థుల హాజరు శాతం కూడా ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని, అప్పుడే చక్కగా నేర్చుకుంటారని తెలియజేశారు.
తదనంతరం హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎల్క దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని విద్యాసంస్థల్లో నిర్వహించి చిన్నపిల్లలకి తెలియకుండా వచ్చేటువంటి కంటి చూపు సమస్యలు,
పోషకాహార లోపం మరియు ఇతర వైద్య సమస్యలు గుర్తించి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్నాము అని వివరించారు.
ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ రవివర్మ, అలాగే హాస్పిటల్ యాజమాన్యాన్ని స్కూల్ చైర్మన్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో విజేత చిల్డ్రన్స్ హాస్పిటల్ హుజురాబాద్ నిర్వాహకులు ఎల్క దేవేందర్ రెడ్డి, ఎడవెల్లి విష్ణువర్ధన్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది మరియు మహాలక్ష్మి ఐ కేర్ సిబ్బంది ఏం. కేసరి నందన్ గారు తదితరులు పాల్గొన్నారు.
Comments