మందమర్రి శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు.

Rathnakar Darshanala
మందమర్రి శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు.
- తెలంగాణ పండుగలో ముఖ్యమైన పండుగ బోనాల పండుగ.

- ప్రిన్సిపాల్ ఎ. రమేష్.
- బెల్లంపల్లి, జూలై 19, బెల్లంపల్లి:
మందమర్రి పట్టణంలో గల శ్రీ చైతన్య పాఠశాలలో తెలంగాణ సంప్రదాయ పండుగ బోనాల ఉత్సవాలు శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. 

పాఠశాల ఆవరణ నుండి పాత బస్టాండ్ వరకు బోనాల విశిష్టత తెలుపుతూ ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎ. రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయంలో ఒకటియైన పండుగ బోనాల పండుగ లని, 

బోనాల పండుగ యొక్క విశిష్టత విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో పాఠశాలలో బోనాల ఉత్సవాలను నిర్వహించామని తెలిపారు. 
పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులు అమ్మవారి, పోతురాజుల అలంకరణలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు బోనాల పాటలపై నృత్యం చేస్తూ బోనాల పండుగ ప్రాముఖ్యత సాంస్కృతిక రూపంలో, విద్యార్థులు కోలాటం, బోనాలతో పాఠశాల ఆవరణలో బోనాల సాంప్రదాయాలని,

 ఈ
బోనాలు ఒక హిందూ పండుగ, ఇక్కడ మహాకాళి దేవిని పూజిస్తారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు.
బోనాలు సాధారణంగా జూలై, ఆగస్టులో వచ్చే ఆశాడ మాసం సందర్భంగా జరుపుకుంటారు. 

పండుగ మొదటి మరియు చివరి రోజులలో యల్లమ్మ దేవత కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పండుగ ప్రతిజ్ఞ నెరవేర్చిన తరువాత దేవతకు కృతజ్ఞతలు తెలుపుతుంది. బోనమ్ అంటే తెలుగులో భోజనం అని అర్ధం, ఇది మాతృదేవికి నైవేద్యం. 

ప్రజలు పాలు, బెల్లంతో పాటు నూనె మట్టి లేదా ఇత్తడి కుండలో వండుతారు, వీటిని వేప ఆకులు, పసుపు మరియు వెర్మిలియన్లతో అలంకరిస్తారు. మహిళలు ఈ కుండలను తమ తలపై మోసుకెళ్ళి, దేవాలయాల వద్ద ఉన్న మాతృదేవికి గాజులు మరియు చీరలతో సహా బోనం సమర్పణ చేస్తారు.  

మైసమ్మ, పోచమ్మ, యెల్లమ్మ, డోక్కలమ్మ, పెడమ్మ, పోలరమ్మ, అంకలమ్మ, మరేమ్మ, నూకలమ్మ మొదలైన వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారిని ఉన్న అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. 

ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ చీరలలో, ఆభరణాలు మరియు ఇతర ఉపకరణాలతో దుస్తులు ధరిస్తారు.

ఈ కార్యక్రమం ను ఏర్పాటు చేసిన వీరిని పాఠశాల యాజమాన్యం డైరెక్టర్ శ్రీవిద్య, చైర్మన్ మల్లంపల్లి శ్రీధర్, ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు లు అభినందించారు.

 ఈ కార్యక్రమంలో
ప్రిన్సిపాల్ ఎ. రమేష్, పాఠశాల డీన్ నాగేశ్వరరావు, సి బ్యాచ్ ఇంచార్జ్ లావణ్య, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ఇంచార్జిలు నూకల. సునీత, తిరుమల, ఉపాధ్యాయ బృందం, మరియు పిఈటి శివాని, డాన్స్ మాస్టర్ సునార్కర్. రాంబాబు విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments