వలిగొండ నుండి చౌటుప్పల్ వచ్చే బస్సును పునరుద్ధరించాలి.
By
Rathnakar Darshanala
వలిగొండ నుండి చౌటుప్పల్ వచ్చే బస్సును పునరుద్ధరించాలి.
*విద్యార్థుల సమయానికి బస్సులు నడిపించాలి*
*ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ల శ్రీనివాస్*
*నేటివార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*
వలిగొండ నుండి చౌటుప్పల్ వచ్చే బస్సులను పునర్ధరించాలని విద్యార్థులకు సమయానుకూలంగా బస్సులు నడపాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తీగుళ్ల శ్రీనివాస్ అన్నారు.
గురువారం రోజున ఎంజీఎం ఎక్స్ రోడ్ వద్ద ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సమయానుకూలంగా బస్సులు నడపాలని వలిగొండ నుండి చౌటుప్పల్ వచ్చే బస్సులను పునరుద్ధరించాలని ధర్నా నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రీ బస్సును పథకాన్ని ఎస్ఎఫ్ఐగా స్వాగతిస్తున్నాం నేలపట్ల కుంట్ల గూడెం సింగరాయ చెరువు మందల్లగూడెం తూర్పు గూడెం గ్రామాల నుండి చౌటుప్పల్ వరకు బస్సును నడపాలి,
గతంలో చౌటుప్పల్ నుండి వలిగొండ వరకు బస్సులు వస్తున్న, ఇప్పుడు ఆ బస్సులను రావడం లేదు విద్యార్థులకు చదువుకు దూరంగా మారింది
విద్యార్థులకు సమయానికి కాకుండా సమయానికి రాకుండా పాఠశాలకు కళాశాలకు వెళ్లడానికి ఆటంకంగా ఉన్నది సమయానుకూలంగా బస్సులు నడపాలి అదేవిధంగా గతంలో చౌటుప్పల్ నుండి వలిగొండకు బస్సులు ఉన్నాయో ఆ బస్సులను పునర్ధరించాలని,
స్థానిక ఎమ్మెల్యే, బస్ డిపో మేనేజర్ గారు స్పందించి వలిగొండ నుండి చౌటుప్పల్ బస్సు పునర్ధరించాలని విద్యార్థుల సమయానుకూలంగా బస్సులను నడపాలని అదేవిధంగా విద్యార్థుల సంఖ్యలను బస్సుల సంఖ్యలను పెంచాలి పెంచినటువంటి బస్సు పాస్ ఫీజును తగ్గించాలని,
మహిళలకు ఏ విధంగా అయితే ఫ్రీ ఉందో కళాశాలకు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఫ్రీ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వెంటనే స్పందించి బస్సులను పునర్దరించాలని లేకుంటే డిపో ముందు విద్యార్థులు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించడం జరుగుతుంది.
ఇంకా ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కొండే శ్రీశైలం డివైఎఫ్ఐ నాయకులు వంశీ ఎస్ఎఫ్ఐ మండల నాయకులు కందటి ఓం సుందర్ రెడ్డి ఇట్టబోయిన శివ కొండే నవీన్ గొర్రె ప్రవీణ్ రెడ్డి గంగాదేవి శేఖర్ కొండే మణికంఠ బోరం శ్రీనివాస్ రెడ్డి గుత్తా మనోహర్ రెడ్డి చీమ కళ్ళ రాజు గంగాదేవి నరసింహ మంద లింగారెడ్డి కొండే మణిశంకర్ పులిపి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Comments