రోడ్లను దున్నేస్తున్నారు.
By
Rathnakar Darshanala
రోడ్లను దున్నేస్తున్నారు.
• కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్లను నలిపేస్తున్న కేజ్ వీల్స్.
• ఫుల్ కేజ్ వీల్స్ తో ఛిద్రం అవుతున్న రహదారులు.
• ప్రతి చోటా ఇదే పరిస్థితి... గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం...
లక్షెట్టిపేట :నేటివార్త జులై 22 :
మారుమూల గ్రామాల నుండి మొదలుకొని మండల కేంద్రాల వరకు గల దాదాపు అన్ని రకాల రోడ్లు కేజ్ వీల్స్ ట్రాక్టర్ల వినియోగంతో ధ్వంసం అవుతున్నాయి.
జిల్లాలో అత్యధికంగా వరి ధాన్యం పంట సాగుచేస్తుండడంతో వరి సాగుకు ముందు పంట పొలాన్ని సిద్ధం చేసేందుకు రైతులు వినియోగించే కేజ్ వీల్స్ ఇటు పొలాలను వరి నాట్లకు సిద్ధం చేసి అదే కేజ్ వీల్స్ తో ట్రాక్టర్లు రోడ్డు ఎక్కి ఇతర ప్రదేశాలకు వెళకుతున్నాయి.
కేజీ వీల్స్ లలో మార్కెట్లో రెండు రకాలు అందుబాటులో ఉండగా ఎక్కువమంది మంది ట్రాక్టర్ల యజమానులు ఫుల్ కేజ్ వీల్స్ ని వినియోగిస్తూ రోడ్లను చిద్రం చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో మాత్రం హాఫ్ కేజ్ వీల్స్ ని వినియోగిస్తుండగా ఎక్కువ భాగం ఫుట్ వీల్స్ వినియోగించి పంట పొలాలను సాగుకు సిద్దం చేస్తున్నారు.
రోడ్లు నాశనం అవుతాయని తెలిసిన కొద్దిమంది ప్రజా ప్రతినిధులు సైతం కేజీ వీల్స్ యంత్రాలను నిర్వహిస్తూ వ్యవసాయ పనులకు ఉపయోగిస్తున్నారు.
కళ్ళముందే రోడ్లన్నీ దున్నేస్తున్న కెజీ వీల్స్ ను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు, బాధ్యులు తమకు ఎందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తూ తమ దారిన తాము పోతున్నారు.
ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చింది నిర్మిస్తున్న రహదారులు ఈ వీల్స్ యంత్రాల బారినపడి నలిగిపోతున్నాయి.
వ్యవసాయ పనులలో ముఖ్యమైన కేజ్ వీల్స్ ట్రాక్టర్ల యజమానులు తమను అడిగే వారు లేరని ఇష్టా రాజ్యంతో వ్యవహరిస్తూ కేజీ వీల్స్ ట్రాక్టర్లను బీటీ రోడ్ల పైన విచ్చలవిడిగా పడువుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్లను ధ్వంసం చేస్తున్నారు.
గ్రామీణ స్థాయిలో నేడు ప్రతి ప్రాంతంలో బీటీ రోడ్ల నిర్మాణం ఒక వైపు జరుగుతుండగా మరోవైపు కేజీ వీల్స్ ట్రాక్టర్ల తాకిడితో రోడ్లు కొద్ది రోజుల్లోనే పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి కిలోమీటర్ల బి టి సి సి ఇతర రోడ్ల నిర్మాణం జరిగి ఉండగా దాదాపు 50 శాతం వరకు రోడ్లు కేజ్ వీల్స్ తాగేడికి గురై ధ్వంసం అయిన ఆనవాళ్లు పరిస్థితులు మన కంటికి కనిపిస్తున్నాయి.
Comments