నూతన రేషన్ కార్డు ల పంపిణి కార్యక్రమం.
By
Rathnakar Darshanala
నూతన రేషన్ కార్డు ల పంపిణి కార్యక్రమం.
*మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి*
*ఎమ్మెల్సీ నెలకంటి సత్యం*
*నేటివార్త దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*
యాదాద్రి భువనగిరి జిల్లా,చౌటుప్పల్ పట్టణంలోని బీఆర్కే కన్వేన్షన్ హాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్ గోపాల్ రెడ్డి
చౌటుప్పల్ మండలం,
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను స్వయంగా అందచేసిన రాజ్ గోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు కులాలకు అతీతంగా పార్టీలకతీతంగా నిజమైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించడం చాలా సంతోషంగా ఉంది
గత పది సంవత్సరాలుగా చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకుంటూనే..
నిరుపేదలకు ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం
గతంలో రేషన్ ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యం దళారుల చేతిలోకి వెళ్తుందని, ప్రభుత్వ ఖర్చు చేసే ప్రతి పైసా నిజమైన పేదవాడికి ఉపయోగకరంగా ఉండాలని సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం
అర్హులైన ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరగొద్దు
రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నామో ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇస్తున్నామో రాబోయే కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తా
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పెన్షన్లు ఇప్పిస్తా
తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకి 10 సంవత్సరాలలో నిరాశే మిగిలింది.ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండ నెరవేరుస్తాం పదేళ్లు అధికారంలో ఉన్న ఇల్లులు ఇవ్వలేదు.
రేషన్ కార్డులు ఇవ్వలేదు,మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వలేదు
దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ,కాంగ్రెస్ పార్టీ తోనే పేదలకు నిజమైన న్యాయం
మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలి.. మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది.. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది.
నూతన రేషన్ కార్డు ఇచ్చింది ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక్క నూతన రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కనీసం రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు కూడా యాడ్ చేయలేదు కానీ ప్రజా ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన రేషన్ కార్డులు అందించడం అభినందనీయం.
పేద ప్రజలకు సన్నబియ్యం అందించడం మంచి పరిణామం గత ప్రభుత్వ మాదిరిగా కక్షపూరితంగా కాకుండా ఈ ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలని అధికారులు కోరుతున్నా
ఇండ్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించింది
రాజ గోపాల్ రెడ్డి గారు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందాలని అధికారులకు చెప్పడం హర్షించనీయ పరిణామం
ఎమ్మెల్యే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజల్లో ముందుకెళ్తున్నారు అని అన్నారు.
Comments