జీవో నంబర్ 49 ను రద్దు చేసే వరకు పోరాడుతాం.
By
Rathnakar Darshanala
జీవో నంబర్ 49 ను రద్దు చేసే వరకు పోరాడుతాం.
గుడిహత్నూర్ లో బంద్ సంపూర్ణం.
*ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా ఆధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్*
//నేటి వార్త గుడి హత్నూర్// 21-07-2025:
ఆదివాసీల ఉనికి అస్థిత్వం మనుగడను దెబ్బతీసే టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాజెక్ట్ ను కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు విస్తరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జి ఓ నెం.49ను రద్దు చేయాలని కోరుతూ,
ఆదివాసి సంఘాల ఉమ్మడి ఆదిలాబాద్ బంద్ పిలుపులో బాగంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు,వర్తక వ్యపారులు స్వచ్చదంగా పాటించి , ఆదివాసుల బంద్ కు మద్దతు తెలిపారు.
ఈ సందర్బంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలో జరిగిన బంద్ లో పాల్గోన్న ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా ఆధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ మాట్లాడుతూ,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల రాజ్యాంగ పరమైన చట్టాలు హక్కులను తుంగలో తొక్కి టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాజెక్ట్ ను విస్తరిస్తామనటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాలలో ఆదివాసులకు గల రాజ్యాంగ పరమైన చట్టాలు, హక్కులు అమలు విషయంలో ఫారెస్ట్ అధికారులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టినారు.
ఇలాంటి అధికారుల వలననే ఆదివాసీల బతుకులు చిద్రమవుతున్నాయని ఆయన వాపోయారు. ప్రభుత్వాలకు ఆదివాసీల జీవితాలకన్నా, వన్యమృగాల ప్రాణాలు ముఖ్యమైనాయని,
టైగర్ కన్జర్వేషన్ పేరుతో ఆ ప్రాంతాన్ని పెట్టుబడి దారులకు, ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్రలు జరుగుతున్నట్లు ఆయన అనుమానం వ్యక్తపరిచినారు.
టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాజెక్ట్ జి ఓ ను రద్దు చేసే వరకు నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా ఆధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్,ఆదివాసి సేన జిల్లా ముఖ్యసలహధారులు ఉయిక లక్ష్మణ్ , ఆదివాసి విద్యార్థి సేన జిల్లా కన్వీనర్ కుంరం చత్రుఘన్,
ఆదివాసి సేన గుడిహత్నూర్ మండల ఆధ్యక్షులు సేడ్మకి భీంరావు,తుడుం దెబ్బ మండల ఆధ్యక్షులు కోవ భగవన్,ఆదివాసి సేన గుడిహత్నూర్ పట్టణ ఆధ్యక్షులు తోడషం లక్ష్మణ్
కోట్నక కేశవ్,
ఆదివాసి సేన మండల ఉపాధ్యక్షులు తోడషం రమేష్ ,ఆదివాసి నాయకులు కుంరం అచ్చంత్ రావు, మేస్రం మోహన్, సేడ్మకీ గణేష్, దుర్వ కోసేరావు తదితరులు పాల్గోన్నారు.
Comments