విమాన ప్రమాదం పై లోతుగా దర్యాప్తు.గాయపడిన వారిని పరామర్శించిన పీఎం మోదీ.

Rathnakar Darshanala
విమాన ప్రమాదం పై లోతుగా దర్యాప్తు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

నేటి వార్త అహమదాబాద్ :

నిన్న జరిగిన AI-171 విమాన ప్రమాద దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులు చికిత్స పొందుతున్న అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జి గారు సందర్శించి వారిని పరామర్శించారు. 
వారికి అందుతున్న చికిత్స గురించి వైద్యులతో ప్రత్యేకంగా చర్చించారు. తదనంతరం ప్రమాద స్థలిని సందర్శించి ప్రమాద తీరు అక్కడి స్థితిగతులు చేపడుతున్న చర్యల గురించి అధికారులతో సమీక్షించారు.
Comments