ప్రైవేటు స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కోరుతూ వినతి.

Rathnakar Darshanala
ప్రైవేటు స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కోరుతూ వినతి.
నిర్మల్ డీఈఓకి టీఎస్‌జెయు నాయకుల వినతిపత్రం* 

 నేటి వార్త నిర్మల్ జిల్లా  ప్రతినిధి  జూన్ 13

ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (TSJU) ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి (డీఈఓ) ను వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

TSJU నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జవాన్ సుదర్శన్, ఇతర సభ్యులతో కలిసి డీఈఓ ను  కలిసి ఈ అంశంపై వినతి తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు విద్యలో రాయితీలు కొనసాగించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు తగిన ఆదేశాలు జారీ చేసి, జర్నలిస్టుల కుటుంబాలకు విద్యలో భారం తక్కువ చేయాలన్నారు. డీఈఓ  వినతిని స్వీకరించి, సమస్యపై సానుకూలంగా స్పందించారు.
Comments