పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు:- పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి.
By
Rathnakar Darshanala
పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు:- పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి.
*నేటివార్త: రిపోర్టర్ రజనీకాంత్*
బెజ్జంకి మండలంలోని బేగంపేట్ గ్రామంలో ఎరవేణి సునీత ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మానకొండూరు శాసనసభ్యులు శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గ్రామంలో అనేక అభివృద్ధి చేస్తూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని,
ఇందులో భాగంగా బేగంపేట్ గ్రామానికి 25 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని లబ్ధిదారులు తొందరగా ఇంటి నిర్మాణం చేపట్టాలని ఇందుకుగాను ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణంతోపాటు ఐదు లక్షల రూపాయల సబ్సిడీ నిధులు దశలవారీగా ఇవ్వనుందని,
ఇంటి నిర్మాణానికి అవసరమున్న ఇసుకను కూడా ప్రభుత్వమే పూర్తిగా అందించనుందని ఈ కార్యక్రమంలో భాగంగా మానకొండూరు.
శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
రానున్న రోజుల్లో అర్హత గల లబ్ధిదారులకు మరిన్ని గృహాలకు మంజూరి రానుందని మొదటి జాబితాలో ఇల్లు రాని వారు నిరాశ చెందకుడదని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు కొరివి లక్ష్మణ్ అధికార ప్రతినిధి జనగాం శంకర్ పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి గుండా అమర్ కార్యదర్శి కృష్ణారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments