ఫోర్జరీ మరియు చీటింగ్ కేసులో నిందితుడి వాకులాబారణం ఆదినాథ్ అరెస్ట్.

Rathnakar Darshanala

ఫోర్జరీ మరియు చీటింగ్ కేసులో నిందితుడి వాకులాబారణం ఆదినాథ్ అరెస్ట్.
 *ఫారెస్ట్ భూమిని తనదంటూ లేఔట్ ప్లాట్లు చేసి విక్రయించిన నిందితుడు.*

 *బాధితులను మోసం చేసి, ఎవరికైనా చెప్పుకోవాలని బెదిరింపు.* 

 *నాలుగు ప్లాట్ లను 3.30 లక్షలకు అమ్మిన నిందితులు.* 

 *భార్యాభర్తల పై కేసు నమోదు, వాకులాభరణం ఆదినాథ్ (అరెస్ట్), భార్య రజిని (పరారీ)*

 *ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.* 

నేటి వార్త ఆదిలాబాద్ బ్యూరో :

 *వివరాలలో* 
బాధితురాలు మరియు ఫిర్యాదుదారు శోభ మురార్ఖర్ w/o Late నందకిషోర్ మురార్కర్, తేదీ 19 6 2025 నాడు మావల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా, ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం. 

వాకులభరణం ఆదినాథ్ (అరెస్టు) మరియు తన భార్య వాకులాభరణం రజిని (పరారీ) లు 2010 సంవత్సరంలో  ఖానాపూర్ శివారులో గల ఫారెస్ట్ భూమిని తన పేరుతో ఉందంటూ నమ్మించి ప్లాట్లు చేసి విక్రయించగా అందులో నాలుగు ప్లాట్లు నంబర్స్ 57 58 59 60 లను మూడు లక్షల 30 వేలకు  బాధితురాలు కొనుగోలు చేస్తుంది. 

ఈ విషయంపై 2022లో ఫారెస్ట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు, అప్పుడు అది ఫారెస్ట్ భూమి అని బాధితులకు తెలుస్తుంది.

 ఈ సందర్భంలో బాధితులు తమ డబ్బులను తిరిగి ఇవ్వాలని, ఫారెస్ట్ భూమిని తమకు డబ్బులకు అమ్మారని నిందితులను అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ కోర్టులో చూసుకోవాలని, మీకు నచ్చిన వారికి చెప్పుకోమని బెదిరించడంతో మరియు బాధితులకు ఫోర్జరీ మరియు మోసం చేయడం జరిగిందని తెలిపారు.

 ఈ విషయంపై మావల పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 289/25 తో కేసు నమోదు అవ్వగా సెక్షన్లు 420,467,468,471,290, 506 r/w 34 ఐపిసి కింద కేసు నమోదు అయి విచారణ జరగగా ఈరోజు ప్రధాన నిందితుడు.

*వకుళాభరణం ఆధినాద్* ను అరెస్టు చేసి గౌరవ న్యాయమూర్తి ముందు ఉంచగా 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు. భార్య రజిని పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నట్లు తెలిపారు.

 ఈ విషయంపై రెవెన్యూ అధికారులను ఫారెస్ట్ అధికారులను విచారణ చేయగా అది ఫారెస్ట్ భూమి అని తేలిందని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. 

భూ అక్రమార్కులపై ఉక్కు పాదం మోపి దిశగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలను తీసుకుంటుందని, ప్రజలను మోసం చేస్తూ, పత్రాలను సృష్టిస్తూ ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
Comments