రోజు పుచ్చకాయ తినడం వల్ల.. ఎన్ని లాభాలో మీకు తెలుసా..?
By
Rathnakar Darshanala
రోజు పుచ్చకాయ తినడం వల్ల.. ఎన్ని లాభాలో మీకు తెలుసా..?
నేటి వార్త హైదరాబాద్:
వేసవికాలంలో ఎండవేడి నుంచి ఉపసమనం కలిగించే పుచ్చకాయను ఉదయాన్నే పరగడుపున తినడం శరీరానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దీన్ని పరిగడుపున తినడం వల్ల ఉదయం నిద్రలేచిన వెంటనే అలసటగా అనిపించడం, మధ్యాహ్నానికి నీరసించిపోవడం వంటి సమస్యలకు చెక్పెట్టొచ్చని చెబుతున్నారు.
వీటిలో ఉండే క్షార గుణాలు మన శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడం వల్ల మన సమస్యలు దూరమవుతాయట.
మనం రాత్రి పడుకున్నప్పుడు శరీరంలో జరిగే ప్రక్రియల కారణంగా ఆమ్లాలు పేరుకుపోయి మనం ఉదయం లేవగానే చికాకుగా, ఎసిడిటీగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్పెట్టేందుకు పరిగడుపున పుచ్చకాయను తినడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
వీటిలో ఉండే క్షార గుణాలు మన శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపసమనం పొందవచ్చంటున్నారు నిపుణులు,
అంతే కాకుండా ఈ పండులో ఉండే సిట్రులిన్' అనే పదార్థం రక్తనాళాలు సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుందట.. తద్వారా మన శరీరంతో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల.. దీన్ని పరిగడుపున తీసుకుంటే మన శరీరం దానిలోని యాంటీఆక్సిడెంట్లను గ్రహించి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి దోహదపడుతుంది,
మనం ఉదయానే పుచ్చకాయను తినడం వల్ల దానిలో ఉండే నీరు, ఖనిజ లవణాలు మన మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంతో పాటు, శరీరాన్ని సహజసిద్ధంగా శుభ్రపరచడంలో తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే పుచ్చకాయలో ఉండే సహజ ఎంజైమ్లు మన జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేయాలంటే.. పుచ్చకాయ తిన్న తర్వాత, అరగంట వరకు ఇతర ఏ ఆహారాన్ని తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
ఈ అరగంట సమయంలో పుచ్చకాయలో ఉండే ఎంజైమ్లు మన జీర్ణవ్యవస్థను తదుపరి ఆహారం కోసం సిద్ధం చేస్తాయని వైద్య నిపుణులు తెలిపారు.
Comments