జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేయడం సరికాదు.

Rathnakar Darshanala
జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేయడం సరికాదు.
- నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలి

 టీడబ్ల్యూజేయు (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు ఎండీ షఫీ హమ్మద్

నేటివార్త, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేయడం సరైనది కాదని టీయూడబ్ల్యూజే ( ఐజేయు ) ములుగు జిల్లా అధ్యక్షులు ఎండి షఫీ హమ్మద్,ఉపాధ్యక్షులు బేతి సతీష్ యాదవ్,గంపల శివ అన్నారు.

శ్రీకాంత్ రెడ్డి పై మంగళవారం సాయంత్రం కొంతమంది కలసి దాడి చేయటం సరికాదని అన్నారు.ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులపై దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 

ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడాలే తప్ప, దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.శ్రీకాంత్ రెడ్డి పై జరిగిన దాడిని తమ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందని,దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. 

లేనిపక్షంలో జర్నలిస్టులమంతా ఏకమై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.శ్రీకాంత్ రెడ్డి పై జరిగిన దాడిని ప్రతి ఒక్క జర్నలిస్టు సంఘాలకు అతీతంగా ఖండించాలని వారు పిలుపునిచ్చారు.
Comments