నేరాల నియంత్రణకు పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
By
Rathnakar Darshanala
నేరాల నియంత్రణకు పోలీస్ సబ్ కంట్రోల్ ఏర్పాటు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
*శివాజీ చౌక్ వద్ద పోలీస్ సబ్ కంట్రోల్ ప్రారంభం.*
*ఎస్బిఐ బ్యాంకు పరిసర ప్రాంతాలలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ కంట్రోల్ కు సబ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ.*
*త్వరితగతిన స్పందించడానికి అందుబాటులోకి పోలీస్ సిబ్బంది .*
*ప్రజలకు తక్షణ సహాయార్థం షిఫ్ట్ ల వారిగా అందుబాటులో ఉండనున్న పోలీసు సిబ్బంది.*
*పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ కు సహకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు*
నేటి వార్త ఆదిలాబాద్ బ్యూరో :
ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ ఏరియా ముఖ్యమైన ప్రదేశం శివాజీ చౌక్ నందు నిత్యం రద్దీగా ఉంటూ ప్రజలతో నిండి ఉంటుందని,
ఆ ప్రదేశంలో ఎలాంటి పోలీసు సహాయ సహకారాలు అవసరమున్న తక్షణ సహాయార్థం ఎస్బిఐ బ్యాంకు వద్ద పోలీస్ సబ్ కంట్రోల్ అందుబాటులో ఉంటుందని అందులోభాగంగానే,
మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్, ఎస్బిఐ బ్యాంకు వారి సహకారం తో ప్రారంభించారు.
మొదటగా బ్యాంకు ఉన్నతాధికారుల జిల్లా ఎస్పీకి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి, సిబ్బంది సమక్షంలో సబ్ కంట్రోల్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శివాజీ చౌక్ ప్రాంతం అనునిత్యం గ్రామీణ ప్రాంత ప్రజలతో రద్దీగా ఉంటుందని,
ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మరియు ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడానికి,
అవాంఛనీయ సంఘటనలో జరిగిన వెంటనే అత్యవసర సమయంలో స్పందించే విధంగా పోలీసు సిబ్బంది ఉండే విధంగా సబ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
ఈ కంట్రోల్ రూమ్ లో సిబ్బంది ఉదయం నుండి రాత్రి వరకు అందుబాటులో ఉంటూ ఎలాంటి అవసరమున్న ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.
బ్యాంకు నందు నిత్యం ప్రజలు నగదు లావాదేవీలు జరిగే పరిస్థితి ఉన్నందున ఎలాంటి నేరాలు జరగకుండా అడ్డుకోవడానికి ఈ కంట్రోల్ రూమ్ సిబ్బంది కృషి చేస్తారని తెలిపారు.
తదుపరి బ్యాంకు ను పరిశీలించి బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లకు భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. అలారం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి , పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు,మున్సిపల్ డీఈఈ కార్తీక్, ఎస్బిఐ రీజినల్ మేనేజర్ జి రామచంద్రరావు, సత్యనారాయణ, సురేష్, శ్రీధర్, ఉత్పల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments