బదిలీపై వెళ్తున్న జిల్లా న్యాయమూర్తికి ఘనంగా వీడ్కోలు.
By
Rathnakar Darshanala
బదిలీపై వెళ్తున్న జిల్లా న్యాయమూర్తికి ఘనంగా వీడ్కోలు.
నేటివార్త ప్రతినిధి రాకం సుమన్ ఏప్రిల్ 19 :
తెలంగాణ హైకోర్టు సాధారణ బదిలిల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత జోగులంబ గద్వాల జిల్లా ప్రధాన జడ్జిగా బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా న్యాయవాదులు ఆమెకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిరిసిల్లలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ న్యాయవాదులు వృత్తి పట్ల నిబద్ధత కలిగి వినమ్రతతో ఉంటారని కొనియాడారు.
ప్రస్తుతం ఉన్న జిల్లా కోర్టు వేరొక చోటుకు తరలించేందుకు ప్రయత్నాలు జరిగితే సీనియర్ న్యాయవాదులు హైకోర్టు వరకు వెళ్లి ఇక్కడి నుంచి కోర్టును ఎక్కడికి వెళ్లకుండా చేశారని గుర్తుచేశారు.
కోర్టు ఇక్కడే ఉంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు.వచ్చే రెండు సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు ఉన్నాయని ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ న్యాయవాదులు తమ ప్రాక్టీస్ ను కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు.
నూతన కోర్టు భవనాలతో పాటు న్యాయ మూర్తులకు కోర్ట్ ఆవరణలో గృహ సముదాయాల ఏర్పాటు వల్ల అధికారులకు పని సులువవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి,సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ గడ్డం మేఘన,ఫస్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ కావేటి సృజన,ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ప్రవీణ్,వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి,
సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జూపల్లి
శ్రీనివాసరావు,వేములవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండ రవి,సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తంగళ్ళపల్లి వెంకటి,ఉపాధ్యక్షులు సజ్జనం అనిల్,క్యాషియర్ వేముల నరేష్,సెక్రటరీ శరత్ రెడ్డి,సీనియర్ జూనియర్,న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Comments