సింగరేణి మండలం ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి.
By
Rathnakar Darshanala
సింగరేణి మండలం ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి.
టి.డబ్ల్యూ.జే.ఎఫ్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కి వినతి....*
నేటివార్త,సింగరేణి(ఏప్రిల్26):
ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై కథనాలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న టి.డబ్ల్యూ.జేఎ.ఫ్ వర్కింగ్ జర్నలిస్టులకు సింగరేణి
మండల ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని శనివారం మండల తాసిల్దార్ సంపత్ కుమార్ కు టి.డబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సింగరేణి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు మండల అధ్యక్షుడు గూడెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.
సానుకూలంగా స్పందించిన తాసిల్దార్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూడేలి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు బోడా అశోక్, ప్రధాన కార్యదర్శి ఆదేర్ల శంకర్ రావు, గౌరవ సలహాదారుడు రాయల శ్రీనివాస్, భయ్యా నాగేశ్వరరావు,ఆదేర్ల నాగరాజు,భాగం నాగేశ్వరరావు,సతీష్ పాల్గొన్నారు.
Comments