వడ్ల కొనుగోలులో పకడ్బంది చర్యలు..ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
By
Rathnakar Darshanala
వడ్ల కొనుగోలులో పకడ్బంది చర్యలు..ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
రైతులను మోసం చేసిన ప్రభుత్వం బి.ఆర్.ఎస్ మాత్రమే.. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
నేటి వార్త ఏప్రిల్ 18 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ
ప్రజా ప్రభుత్వంలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాం..
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్, పాలకుర్తి, గుంటూరు పల్లి, ఎల్కలపల్లి, కొత్తపల్లి, రామారావుపల్లి, తక్కలపల్లి, పుట్నూర్, గుడిపల్లి, జయారం, కుక్కలగూడూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఏం.ఎస్ రాజ్ ఠాకూర్ శుక్రవారం ప్రారంభించారూ.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — రైతులకు మద్దతు ధర కల్పిస్తూ, దళారులు లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేయబడతాయని ఎమ్మెల్యే వివరించారు.
రైతులు ఎటువంటి మధ్యవర్తులు, దళారులు లేకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని విక్రయించవచ్చని సూచించారు.
ప్రతి రైతుకు పూర్తి సమాచారం అందించేందుకు స్థానిక అధికారులు, గ్రామ వాలంటీర్లు సమన్వయంగా పనిచేస్తున్నారని తెలిపారు నేను ఎమ్మెల్యే అయినా తరువాత మూడు సీజన్లు గింజ కటింగ్ లేకుండా రైతులు వరి ధాన్యం కొనడం జరిగింది.
ఈ నాలుగో పసలకు కూడా గింజ కటింగ్ ఉండదని అన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రైతులు వరి ధాన్యము నుంచి క్వింటాలను 10నుంచి 15 కిలోల వరకు కోతపేట్టి రైతన్నను ఇబ్బందికి గురి చేశారని అన్నారు.
ఈ నియోజకవర్గం ఈ వేసంగి లో కూడా మన ప్రజా ప్రభుత్వం సహకారంతో ప్రతి పంటకు సాగు నీరు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుత్వ అధికారులు, రైతు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments