మహాత్మా జ్యోతిబాపులే సేవలు మరువలేనివి.బోరంచు శ్రీకాంత్ రెడ్డి.
By
Rathnakar Darshanala
మహాత్మా జ్యోతిబాపులే సేవలు మరువలేనివి.బోరంచు శ్రీకాంత్ రెడ్డి.
* అణగారిన వర్గాల ఆశాజ్యోతి,
* స్త్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు జ్యోతిబాపూలే.
- ఘనంగా జ్యోతిరావ్ పూలే 199వ జయంతి వేడుకలు.
నేటి వార్త ఆదిలాబాద్:
స్త్రీ అభ్యున్నతికి, బాలిక విద్య, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫుల్ దేశానికి చేసిన సేవలు యావత్ భారతదేశం ఎన్నటికీ మరిచిపోలేదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
వారి జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లోని బీసీ స్టడీ సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిరావ్ పూలే గారి విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందని నమ్మిన నాయకుడు జ్యోతిరావు పూలే గారని గుర్తుచేశారు. భారతదేశంలో సామాజిక న్యాయానికి, విద్యా విప్లవానికి బడులు వేసిన గొప్ప శిల్పి అని అన్నారు.
ఆయనను మనం కేవలం స్మరించుకోవడమే కాకుండా, ఆయన ఆశయాల ప్రకారం నడవాల్సిన అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు,
మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పరమేశ్వర్,
ఆదిలాబాద్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సామారూపేష్ రెడ్డి, మావల మాజి ఎంపిపి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నవీన్ రెడ్డి,విజయ్ పొట్టిపెల్లి, సామాల ప్రశాంత్,విశ్వబోధి,ప్రభాకర్,ఫేరోజ్, అంబడి అక్షయ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments