ADILABAD :వైద్య ఖర్చులకు కంది శ్రీనివాస రెడ్డి 50వేల రూపాయల ఆర్థిక సాయం.
By
Rathnakar Darshanala
వైద్య ఖర్చులకు కంది శ్రీనివాస రెడ్డి 50వేల రూపాయల ఆర్థిక సాయం.
ఆదిలాబాద్ నేటి వార్త: తన నియోజక వర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానన్న భరోసా కల్పిస్తున్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి.
ఆపద సమయాలలో ఆదుకునే ఆపధ్బాంధవుడు అని నియోజకవర్గ ప్రజలు అందుకే అంటుంటారు. మావల మండలం తాజా మాజీ జెడ్పీటీసీ నల్ల రాజేశ్వర్ అనారోగ్యానికి గురై,
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని శనివారం తన క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్ లో ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం 50వేల రూపాయల ఆర్థిక సాయాన్ని రాజేశ్వర్ సన్నిహితులు మాల సంఘం అధ్యక్షులు కొప్పుల రమేష్, పాషం రాఘవేందర్ లకు అందచేసారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments