Tamsi :కంకర వేశారు... వదిలేశారు.

Rathnakar Darshanala
కంకర వేశారు... వదిలేశారు.
             అసంపూర్తి పనులు 

* తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు.

* బైక్ నడపాలంటే నరకం చూడాల్సిందే.

* పొన్నారి , పాచ్చేర, బండల్ నాగపూర్. వడ్డాది ప్రజల ఇక్కట్లు.

నేటి వార్త బ్యూరో ఆదిలాబాద్ /తాంసీ :గత ప్రభుత్వం ప్రజా సౌకర్యార్థం బండల్ నాగపూర్ నుండి పొన్నారి వరకు ఐటీ డిఏ నిధులు మంజూరు చేసింది.

 దీంతో బిటి రోడ్డు పనులు మొదలు పెట్టారు.మొదట్లో పనులు చురుకుగా సాగినప్పట్టికి తరువాత రోడ్డు పనులు నిలిచిపోయినాయి, 

సదరు గుత్త దరు మొదలు నేలను చదును చేసి గిట్టి రాయి వేసి ఆలా వదిలేశారు.దీంతో నాలుగు గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఇక ఆ దారిలో బండి నడపాలంటేనే జంకుతున్నారు వాహనదారులు. మొదట తమ ఊరికి బిటి రోడ్డు వస్తుంది అని సంతోష పడ్డ రైతులు,ఇప్పుడు గోస వెళ్ళబు్చుకుంటున్నారు.

సంవత్సరాలు గడిచిన అటువైపు చుసిన పాపాన పోలేదు అధికారులు. అధికారుల తీరు పై కాంట్రాక్టర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు రైతులు,ఇప్పటికైనా సదరు కాంట్రాక్టర్ రోడ్డు పనులను పూర్తి చేయాలనీ చుట్టూ పక్కల గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.
Comments