Ap :ఎవడు చస్తే మాకేంటి.

Rathnakar Darshanala
ఎవడు  చస్తే మాకేంటి.
*ఇంటిపై విద్యుత్ తీగలు.*

*పొంచి ఉన్న ప్రమాదం పై స్పందించని స్థానిక విద్యుత్ శాఖ..*

*సమస్యపై విలేజ్ హెల్పర్ & బిల్ రీడర్ మేకపోతు గాంభీర్యం.*


 రేపటి లోగా విద్యుత్ వైర్లను సరిచేస్తాం రుద్రవరం విద్యుత్ ఏఈ నవీన్ కుమార్.

 నేటి వార్త ఫిబ్రవరి 4 రుద్రవరం :

 విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని వాటిని సరి చేయాలని పలుమార్లు విద్యుత్ సిబ్బందిని వేడుకోగా ఎవరు చచ్చితే మాకేంటి నేనింతే మేం మారం అనే ధోరణిలో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు.
 
విద్యుత్ లైన్ లాగిన కాంట్రాక్టర్    సిబ్బంది తప్పిదం. వెరసి ఓ దళిత కుటుంబానికి విద్యుత్ సప్లై ప్రాణాంతకంగా ప్రమాదం పొంచి ఉన్న సంఘటన రుద్రవరం మండలంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే 

రుద్రవరం చిలకలూరి గ్రామానికి చెందిన  దళిత కాలనీలో ఉన్నటువంటి మహేష్ అనే బాధితుడు కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాడు  :- నివసించే ఇంటి గోడకు  విద్యుత్ తీగలు తగిలి (టచ్ అయ్యి) ఇతరులకు సప్లయ్ ఇచ్చారు. 

ప్రమాదం పొంచి ఉందని పలుమార్లు సిబ్బందికి విన్నవించుకున్న ఫలితం లేదు 
గతంలో ఎప్పుడే గాని ఇటువంటి ప్రాణాపాయ పరిస్థితి తలెత్తలేదు*
*గ్రామంలో ప్రస్తుతం విద్యుత్ స్తంభాలను మార్చి ఇతర చోట పోల్స్ పాతడం వల్ల రెండు నెలలుగా ఇంటికి విద్యుత్ తీగలు టచ్ అయ్యాయి*

మరో వారం రోజుల్లో లక్ష్మీ నరసింహ స్వామి పారువేట ఉత్సవంఉంది ఇంటికి రంగులు వేసుకోవాలన్నా  బందు మిత్రులను ఇంటికి పిలుచుకోవాలన్నా  పరిస్థితి ప్రాణాంతకంగా పొంచివుందని ఆందోళన బాధితులు ఆందోళన చెందుతున్నారు.

 విద్యుత్ తీగలు ఇంటికి టచ్ కాకుండా సరి చెయ్యమని స్తానిక విద్యుత్ సిబ్బందికి అధికారులకు గత రెండు నెలలుగా ఎంత చెప్పినా ప్రాధేయ పడినా తీగలు సర్దుబాటు  చేయకపోవడం పట్ల ఎవడు చస్తే మాకేంటి అన్నట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది.

 చిలకలూరు గ్రామంలో బిల్ రీడర్ గా హెల్పర్ గా ఉన్న బండి ప్రతాప్ ఏయికి ఎక్కువ బిల్ రీడర్ కు తక్కువ అన్నట్లు వ్యవహార శైలి ఉంది. 
   చిలకులూరు గ్రామ సర్పంచ్ గోపవరం ప్రసాద్ రెడ్డి 

గ్రామంలో విద్యుత్ వినియోగ దారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ  ఏయి ఎడియి కలెక్టర్ కు చెప్పుకున్నా   తనను ఎవరేమి చెయ్యలేరు అంటూ నిర్లక్ష్యపు సమాధానంతో విద్యుత్ వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తూన్నారు.

విద్యుత్ శాఖ సిబ్బంది కాంట్రాక్టర్ సిబ్బంది ఇరువురు కలసి సంయుక్తంగా చేసిన తప్పిదం సరిదిద్దమని ప్రదేయపడితే చూస్తాం చెపుతాం అంటూ రెండు నెలలుగా కాలయాపన చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,

 పెను ప్రమాదం అని తెలిసినా స్పందికపోవడం సమస్యను అధికారులకు వివరించి పరిష్కారానికి కృషి చేయాల్సిన హెల్పర్ & బిల్ రీడర్ సమస్యను మరింత జటిలం చేసేలా ప్రవర్తిస్తూ ఎవడు చస్తే మాకేంటి  మాకేమీ కాదు అన్న చందంగా వ్యవహరిస్తున్నాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

సర్పంచ్ వివరణ.

 ఈ విషయంపై చిలకలూరు  గ్రామ సర్పంచ్ గోపవరం ప్రసాద్ రెడ్డి నీ వివరణ అడగగా  విద్యుత్ శాఖ సిబ్బంది కి మరియు కాంట్రాక్టర్ కు పలు మార్లు సమస్య గురించివివరించినప్పటికి చూద్దాం చేద్దాం అంటూ కాలయాపన చేస్తున్నారని చిలకలూరు గ్రామ పంచాయితీ సర్పంచ్ గోపవరం ప్రసాదరెడ్డి పేర్కొన్నారు.

*గ్రామపంచాయితీకార్యదర్శి :-* 
చిలకలూరు గ్రామ పంచాయితీ కార్యదర్శి ఇంటికి టచ్ అయిన విద్యుత్ తీగలను పరిశీలించి రుద్రవరం ఎంపీడీవో గారి దృష్టికి తీసుకువెలుతానని తెలిపారు.

వర్షం వచ్చినా,మిద్దేపై బట్టలు అరబొసిన తెలిసితెలియని చిన్నారులు మిద్దె పైకి ఎక్కి ఇనుప చివ్వలతో అడుకున్నా చాలప్రమాదం ఉందని గ్రామ పంచాయితీ కార్యదర్శి సమాధానం ఇచ్చారు

 విద్యుత్తు మండల ఏఈ వివరణ 


 చిలకలూరి గ్రామంలోని దళితవాడలో ఉన్నటువంటి విద్యుత్ సమస్య ఈరోజే తమ దృష్టికి వచ్చిందని నేను కొత్తగా నాలుగు రోజులు కిందట బాధ్యతలు చేపట్టాలని మరుసటి రోజే సమస్య సాల్వ్ చేస్తానని రుద్రవరం మండల విద్యుత్ ఏ ఈ నవీన్ కుమార్ తెలిపారు
Comments