ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు.

Rathnakar Darshanala
ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు.
నేటివార్త ఫిబ్రవరి 5 జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి:


యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయికల్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.

పట్టణానికి చెందిన గాజుల మనోజ్ (28) అనే యువ మెకానిక్ మంగళవారం రాత్రి ఇంటి నుండి వెళ్లి ఊరి బయట ఉన్న మర్రి చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

బుధవారం ఉదయం అటుగా వెళ్లిన వారికి మనోజ్ చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.స్థానికంగా టూ వీలర్ బైక్ మెకానిక్ గా పని చేసేవాడు.

ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మనోజ్ మృతితో కుటుంబ  సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments