యువత క్రీడలపట్ల ఆసక్తి చూపాలి.MLA కవ్వంపల్లి సత్యనారాయణ.
By
Rathnakar Darshanala
యువత క్రీడలపట్ల ఆసక్తి చూపాలి.
*ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ*
నేటివార్త ప్రతినిధి రాకం సుమన్ ఫిబ్రవరి 02:
యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
స్పోర్ట్స్ క్లబ్ ఇల్లంతకుంట ఆధ్వర్యంలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (కేపీఏసీ) గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు శనివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో ఏర్పాటు కార్యక్రమంలో బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా మంచి మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని సూచించారు.
నేటి విద్యార్థులు,యువత సెల్ ఫోన్లలో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ క్రీడలపట్ల ఆసక్తి చూపడం ద్వారా శారీరకంగా,మానసికంగా ఉల్లాసంగా ఉంటారని తద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధిస్తారని అన్నారు.
మానకొండూర్ నియోజకవర్గంలో క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడల నిర్వహణకు ప్రోత్సాహన్ని అందిస్తాని తెలిపారు.యువతతోనే రాష్ట్ర, దేశ భవిష్యత్తు అని అందుకు అనుగుణంగా యువత మంచి మార్గంలో పయనించాలని సూచించారు.
అనంతరం ఇల్లంతకుంట బెజ్జంకి జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రథమ స్థానంలో విజేతగా నిలిచిన ఇల్లంతకుంట న్యూ వారియర్స్ జట్టు సభ్యులకు 33,333 రూపాయల నగదు,మెడల్స్ తోపాటు విన్నర్స్ కప్పును అందజేశారు.
అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన బెజ్జంకి నవ యువ యూత్ జట్టు సభ్యులకు 22,222 రూపాయల నగదు ,మెడల్స్,రన్నారప్ కప్పును అందజేశారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు మామిడి రాజు,
మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్,సీనియర్ నాయకులు గొడుగు నర్సయ్య,అంతగిరి బాల పోచయ్య,ఒగ్గు రమేష్,ఐరెడ్డి మహేందర్ రెడ్డి,పసుల వెంకటి,కునబోయిన బాలరాజు, కాసుపాక శంకర్,చిట్టి ప్రదీప్ రెడ్డి,ఉప్పల అమరేందర్,
అంతగిరి వినయ్,ప్రసాద్,మామిడి నరేష్,జమాల్,యువజన నాయకులు రేగుల కార్తిక్,గొడుగు భూపతి,కొయ్యడ రాము,ఎగుర్ల దత్తు,రాకం సుమన్,కొట్టే బాలకృష్ణ,దాసరి శివరాం,ఒగ్గు మధు,ఎండ్ర నరేష్,మోజేష్,వజ్జేపల్లి శ్రీకాంత్,తుమ్మ
బాలు,దాసు,సన్ని,డైరెక్టర్లు,నాయకులు,క్రీడాకారులు,యువజన సంఘ సభ్యులు,స్పోర్ట్స్ క్లబ్ సభ్యులుపాల్గొన్నారు.
Comments