నిర్మల్ పట్టణ బిజెపి అధ్యక్షులుగా ఎన్నికైన సుంకరి సాయికి సన్మానం.

Rathnakar Darshanala
నిర్మల్ పట్టణ బిజెపి అధ్యక్షులుగా ఎన్నికైన సుంకరి సాయికి సన్మానం. 
 నేటి వార్త నిర్మల్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 2  

భారతీయ జనతా పార్టీ నిర్మల్ పట్టణ అధ్యక్షులుగా  బంగాల్పేట్ కు చెందిన సుంకరి సాయి నియమితులయ్యారు.  

బీజేఎల్ పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తనపై నమ్మకంతో బీజేపీ నిర్మల్ పట్టణ అధ్యక్షులుగా నియమించినందుకు సుంకరి సాయి కృతజ్ఞతలు తెలిపారు. 

తనపై పెట్టిన నమ్మకాన్ని ఉంచుకుంటానని, ఎల్లవేళలా మహేశ్వర్ రెడ్డి వెంటే ఉంటానని, బిజెపి అభివృద్ధికి కృషి చేస్తానని సుంకరి సాయి తెలిపారు. 

ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంకు చెందిన పలువురు బిజెపి నాయకులు, బిజెపి నిర్మల్ పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన సుంకరి సాయికి పుష్పగుచ్ఛం అందించి, శాలువతో ఘనంగా సన్మానించారు. 

అనంతరం బంగాల్పెట్ మాజీ కౌన్సిలర్ పాతర్ల గణేష్ మాట్లాడుతూ బిజెపి పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు సుంకరి సాయికి అభినందనలు తెలిపారు. 

ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు.

 ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బోదారపు నరేష్, బూత్ అధ్యక్షులు పి సత్యం, ఎం. పోశెట్టి, పురుషోత్తం, రమణ, తదితరులు పాల్గొన్నారు.
Comments